Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 996 పని సంస్కృతిపై తీవ్ర వ్యతిరేకతలు
- జాక్ మా తీరుపై నెట్లో నిరసనలు
బీజింగ్: ఉద్యోగుల పని గంటలపై ప్రము ఖ ఈ-కామర్స్ దిగ్గజం ఆలీ బాబా గ్రూపు చైర్మెన్ జాక్ మా చేసిన వివా దాస్పద వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. 'ఆలీబాబా గ్రూప్లో మీరు కొనసాగాలంటే.. వారంలో ఆరు రోజుల పాటు రోజుకు 12గంటల చొప్పున పనిచేయాలి' అని జాక్ మా ఇటీవల తన ఉద్యోగులకు ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. ఇటీవల జరిగిన కంపెనీ అంతర్గత సమావేశంలో జాక్ మా సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 8 గంటలు పనిచేసే ఉద్యోగులు కంపెనీకి అవసరం లేదని.. ఆ సంస్క తి పోవాలని ఆలీబాబా అధికారిక వైబో అకౌంట్లోనూ ఒక పోస్టును ఉంచారు. అన్ని చోట్లా అందరూ '996' పని సంస్క తి అలవాటు చేసుకోవాలని, అలా పనిచేయడం అదృష్టంగా భావించాలన్నారు. '9-9-6' అంటే ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ వారంలో ఆరు రోజులూ పనిచేయాలన్నది జాక్ మా ఉద్దేశం. దీనిపై చైనా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్మీడియాలో నెటిజన్లు విరుచుకుపడు తున్నారు. ఇప్పటికే స్టార్టప్ కంపెనీలను ప్రారంభించి, అత్యధిక పనిగంటలు చేస్తున్న అనేకమంది ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇది కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. '996' కల్చర్ ప్రకారం పనిచేసినా, అందుకు తగిన వేతనం ఇవ్వాలి కానీ, అదే జీతంపై అన్నేసి గంటలు పనిచేయడం దుర్మార్గమని విమర్శిస్తున్నారు. 'ఆయన కంపెనీ యజమాని కాబట్టి 996 చేసినా పర్వాలేదు. ఎందుకంటే అందువల్ల ఆయన సంపదే పెరుగుతుంది. కానీ, ఉద్యోగులు ఎందుకు చేయాలి. జాక్ మా సంపదను మరింత పెంచడానికా..' అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై తీవ్ర దుమారం రేగుతుండడంతో నష్ట నివారణ చర్యలను ప్రారంభించాలే జాక్ మా సన్నద్ధమవుతున్నట్టుగా సమాచారం.