Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: మెట్రోపోలీస్ హెల్త్‌కేర్ షేర్లు సోమవారం మర్కెట్లో నమోదయ్యాయి. ఈ షేర్లు ఊహకందని విధంగా దాదాపు 9.1శాతం ప్రీమియంతో మార్కెట్లో లిస్టైయ్యాయి. ఈ షేర్ల ఇష్యూ ధర కేవలం రూ.880కాగా సోమవారం ట్రేడింగ్‌లో ఇది అత్యధికంగా రూ.960 వరకు వెళ్లాయి. ఈ ఐపీవో మెట్రోపోలీస్ రూ.1,204 కోట్లు సమీకరించింది. ఈ ఏప్రిల్ 3-5 మధ్యలో జరిగిన ఐపీవో బిడ్డింగ్ సమయంలో 5.84 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. మెట్రోపోలీస్ దేశ వ్యాప్తంగా 19రాష్ట్రాల్లో విస్తరించింది. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో దీని వ్యాపారం బలంగా ఉంది. మొత్తం 83 క్లినికల్ లేబోరేటరీలు, 1,473 పేషెంట్ టచ్పాయింట్లు ఉన్నాయి.