Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమర్షియల్ బ్యాంకులపై వచ్చిన వార్తలకు ఆర్బీఐ వివరణ
న్యూఢిల్లీ : కమర్షియల్ బ్యాంకులకు వారంలో ఐదు రోజులే పనిదినాలన్న సూచనలు జారీ చేయలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) శనివారం స్పష్టం చేసింది. కమర్షియల్ బ్యాంకులు వారంలో ఐదు రోజులు మాత్రమే నిర్వహణలో ఉంటాయని కొన్ని మీడియా సెక్షన్లలో వార్తలు వచ్చాయని, వాటిలో వాస్తవం లేదని ఆర్బీఐ తాజాగా స్పష్టత నిచ్చింది. వారంలో ఐదు రోజుల పనిదినాలకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేయలేదని వివరించింది. ప్రస్తుతం ఆదివారంతోపాటు నెలలో రెండు, నాలుగో శనివారాల్లో కమర్షియల్ బ్యాంకులు సెలవు పాటిస్తున్నాయి. మిగితా రెండు శనివారాల్లో యథావిధిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.