Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పెళ్లికావాల్సిన యువత వివాహానికి ముందే ఒకరినొకరు మరింతగా తెలుసుకొనేందుకు వీలు కల్పిస్తూ దిల్ కే రిష్తే మ్యాట్రిమోనీ వెబ్సైట్ వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చింది. తమ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో వినూత్నంగా వీడియో ఆధారిన బయోడేటా సేవలను ఈ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆదిదేవ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ వెబ్సైట్ సేవలను హైదరాబాద్ కేంద్రంగా బుధవారం నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. పెండ్లికావాల్సిన యువత తమ ప్రొఫైల్‌కు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటుగా వారికి సంబంధించిన అందమైన వీడియాలను కూడా ఈ మ్యాట్రిమోని వెబ్సైట్లో అప్లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించనుంది. పెండికావాల్సిన యువత వ్యక్తిగత వివరాలను బయటకు తెలపకుండానే ఒకరితో ఒకరు వ్యక్తిగత విషయాలను తమతమ అభిప్రాయాలను పంచుకొనేందుకు వీలుగా ఇందులో ఏర్పాటు చేసినట్టుగా నిర్వాహకులు తెలిపారు. మ్యాట్రిమోని మార్కెట్ భారత్‌లో రూ.1000 కోట్లకు చేరవలో ఉందని.. రానున్న ఏడాది కాలంలో ఇందులో కనీసం 10 శాతం వాటాను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నట్టుగా నిర్వాహకులు వెల్లడించారు.