Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఐఎల్ అండ్ఎఫ్ఎస్ ఆడిట్ విషయంలో డెలాయిట్ నిషేధం ముప్పును ఎదుర్కొంటోంది. ముఖ్యం గా సెక్షన్ 140(5) కింద కార్యకలాపాలకు ఐదేళ్ల పాటు దూరం అయ్యే అవకాశముంది. గతంలో కూడా ఈ సెక్షన్ కింద ప్రైస్వాటర్హౌస్పై సెబీ వేటు వేసింది. అప్పట్లో సత్యం కుంభకోణం కేసులో ఈ సంస్థ ఆరోపణలు ఎదుర్కొంది. దీంతో రెండేళ్లపాటు లిస్టెడ్ కంపెనీల ఆడిటింగ్ చేయకుండా నిషేధం విధించింది. పీడబ్ల్యూకు చెందిన రెండు భాగస్వామ్య సంస్థలను కూడా మూడేళ్లపాటు నిషేధించింది. దీనిపై డెలాయిట్ ప్రతినిధి ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ''ఐఎల్ఎఫ్ఎస్ అనుబంధ సంస్థ అయిన ఐఎఫ్ఐ ఎన్పై విచారణ జరుగుతోంది. మేము దీనికి పూర్తిగా సహకరిస్తున్నాం. గతంలో నిర్వహించిన ఆడిట్లు మొత్తం నిబంధనలకు పూర్తి అనుకూలంగా ఉన్నాయన్న మాటకు కట్టుబడి ఉన్నాం'' అని పేర్కొన్నారు.