Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుబరు వేదికగా అందుబాటులోకి బట్టిస్టా వాహనం
- ఫార్ములా వన్ కారు కంటే స్పీడ్‌తో విపణిలోకి..
దుబాయ్: మహీంద్ర సంస్థకు చెందిన ఇటలీ కార్ల తయారీ సంస్థ ఆటోమొబైలి పినిన్ఫారిన మిడిల్ ఈస్ట్ మార్కెట్లోకి సరికొత్త హైపర్‌కార్ బట్టిస్టాను విడుదల చేసింది. దీని ధర 20లక్షల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో రూ.13.95 కోట్లు. ఇది పూర్తి ఇటాలియన్ డిజైన్‌తో తయారు చేసిన ఉద్గార రహిత ఎలక్ట్రిక్ కారు. దీనిని దుబారులో విడుదల చేశారు. ఈ కారు పూర్తి ఉత్పత్తిని ఇటలీలోని కాంబియానో ఉత్పత్తి కేంద్రంలో 2020 ద్వితీయార్థంలో ప్రారంభిస్తారు. కంపెనీ మొత్తంగా 150 కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనుంది. వీటిల్లో కనీసం 50 కార్లు మధ్య ప్రాచ్యంలో విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. సరికొత్త బట్టిస్టా కారులో తొలిసారి 120 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చారు, నాలుగు చక్రాలకు నాలుగు మోటార్లు ఉంటాయి. మొత్తం కలిపి 1900 బీహెచ్పీ శక్తిని, 2,300 ఎన్ఎం టార్క్‌ను ఇవి విడుదల చేస్తాయి. 0-100 కిలోమీటర్లను కేవలం రెండు సెక్లనలోపు అందుకుంటుంది.12 సెకన్ల లోపు గంటకు 300 కిలోమీటర్ల వేగానికి చేరుతుంది. దీని అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు. దీనిని గంటకు 450 కిలోమీటర్లకు కూడా చేర్చవచ్చ. ప్రస్తుత ఫార్ములా1 కారుకన్నా ఇది చాలా వేగవంతమైంది.