Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ సంస్థ పేటీఎం మార్కెట్లోకి క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. సిటీ బ్యాంక్ భాగస్వామ్యంతో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుగా దీనిని మార్కెట్లోకి తెచ్చారు. పేటీఎం యాప్ నుంచే పేటీఎం ఫస్ట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు యూజర్లు డైనింగ్, షాపింగ్, ట్రావెల్ వంటి వాటికి సంబంధించి ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు కూడా పొందొచ్చు. పేటీఎం క్రెడిట్ కార్డుతో ప్రతి లావాదేవీపై ఒక శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. దీనికి ఎలాంటి పరిమితులు ఉండవు. ప్రతి నెల ఈ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డు అకౌంట్లో ఆటోమేటిక్‌గా జమ అవుతుంది.