Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ ప్రయివేటు రంగ విమానయాన సంస్థ ఇండిగో వేసవి డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్లో భాగంగా 10 లక్షల సీట్లను తక్కువ ధరతో ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నట్టుగా సంస్థ తెలిపింది. ఇండిగో సంస్థ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్లో భాగంగా దేశీ విమాన టికెట్లను రూ.999 ప్రారంభ ధరతో అందిస్తోంది. ఇక విదేశీ ప్రయాణపు టికెట్ ధర రూ.3,499 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. ఈ డిస్కౌంట్ ఆఫర్లో బుకింగ్స్ మే 14 నుంచి 16 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్నవారు మే 29 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో ఎప్పుడైనా విమాన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ నాన్ స్టాప్ ఫ్లైట్స్‌కు మాత్రమే వర్తించనుంది. మరోవైపు కంపెనీ విమాన టికెట్ల బుకింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది.