Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణి జ్య విభాగం: ప్రముఖ వినోద పార్క్‌ల నిర్వ హణ సంస్థ వండర్లా హాలిడేస్ మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఆకర్షణ ీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటిం చింది. జనవరి- మార్చి మధ్య కాలంలో సంస్థ పన్ను అనంతర నికర లాభం రూ.6.99 కోట్లుగా నమోదు అయింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయానికి సంస్థ నికర లాభం కేవలం రూ.3.68 కోట్లుగా ఉంది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో సంస్థ స్థూల ఆదాయం రూ.56.38 కోట్ల నుంచి రూ.63.55 కోట్లకు చేరుకుందని వండర్లా సంస్థ మార్కెట్లకు వెల్లడించిన సమాచారంలో పేర్కొంది. మార్చితో ముగిసిన మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను వండర్లా హాలిడేస్ నికర లాభం రూ.55.41 కోట్లకు చేరుకుంది. ఇది అంతకు ముందు ఏడాది సాధించిన నికర లాభం కంటే దాదాపు 44% అధికం. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వండర్లా సంస్థ మొత్తం ఆదాయం రూ.278 కోట్ల నుంచి రూ.291.66 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సంస్థ 18 శాతం డివిడెండ్‌ను అందించాలని నిర్ణయించింది. వండర్లా సంస్థ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో వినోదపు పార్క్‌లను నిర్వహిస్తోంది. దీనికి తోడు బెంగళూరులో ఈ సంస్థ వండర్లా రిసార్ట్స్‌ను కూడా నడుపుతోంది. రానున్న రోజుల్లో మరింత మెరుగైన లాభాలను ఆర్జించేందుకు తాము కృషి చేస్తున్నట్టుగా సంస్థ తెలిపింది.