Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం చైనా సంస్థ వివో మార్కెట్లోకి భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్ను ఆవిష్కరించింది. వివో బ్రాండ్లో బాగా ప్రాచుర్యం ఉన్న 'వై' సిరీస్లో భాగంగా వై-3 పేరుతో ఈ కొత్త స్మార్ట్ఫోన్ను సంస్థ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. వెనుక వైపు మూడు మేటి కెమేరాలు, భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా దీనిని మార్కెట్లోకి తెస్తున్నట్టుగా కంపెనీ వివరించింది. ఈ ఫోన్లోని ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి. 6.35 అంగుళాల తెర, 720, 544 పిక్సెల్స్ రిజల్యూషన్, మీడియా టెక్ హీలియో పీ 35 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 13,8, 2 మెగా ఫిక్సెల్ సామర్థ్యం కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. పెరుగుతున్న స్మార్ట్ఫోన్ వాడకం సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ కొత్త ఫోన్ను భారీ బ్యాటరీతో రూపొందించినట్టుగా వివో తెలిపింది.