Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో దేశీయ విమానాల టికెట్లకు బుకింగ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ సరికొత్త సేవలను భారత్‌లో షురూ చేసింది. ఇక నుంచి అమెజాన్ దేశీయ విమాన టికెట్లను బుక్ చేసుకొనే అవకాశం కల్పించింది. ఇప్పటికే షాపింగ్, నగదు బదలాయింపు, బిల్లుల చెల్లింపు, మొబైల్ రీచార్జ్ ్జ వంటి సేవలను అమెజాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో బుక్ చేసు కొన్న టికెట్లను రద్దు చేస్తే అదనంగా ఎలాంటి చార్జీలు వసూలు చేయ బోమని అమెజాన్ అంటున్నంది. కేవలం విమానయాన సంస్థ విధించే పెనాల్టీలు మాత్రం చెల్లిస్తే చాలని తెలిపింది. సరికొత్త సేవలను 'క్లియర్‌ట్రిప్' సంస్థతో కలిసి అమెజాన్ యాప్‌లో ప్రారంభించారు. ''మేము క్లియర్ ట్రిప్‌తో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాం. మా కస్టమర్లకు అత్యున్నత శ్రేణి సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. అమెజాన్ యాప్ వినియోగదారులకు, ప్రైమ్ సభ్యత్వం తీసుకొన్నవారికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. '' అమెజాన్ పే డైరెక్టర్ షరీక్ తెలిపారు.