Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: హైదరాబాద్ నగర వాసులకు మరో అతిపెద్ద షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. ఆబిడ్స్ వద్ద సుమారు 40,000 చదరపు అడుగుల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 'బిగ్ షాప్ ఇన్ మాల్'ను సినీనటి తమన్నా శనివారం ప్రారంభించారు. మిల్కీబ్యూటీ తమన్నాను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇంత పెద్ద షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా, ముఖ్యంగా ఆడవారికి ఈ షాపింగ్ మాల్ ఎంతగానో నచ్చుతుందని ఆమె అన్నారు. అనంతరం ఆమె షాపింగ్‌మాల్ అంతటా కలియ తిరిగి షాపింగ్ చేశారు. 'బిగ్ షాప్ ఇన్ మాల్' డైరెక్టర్ గునరంజన్ సూరి మాట్లాడుతూ హైదరాబాద్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్గా తమ ఔట్‌లెట్‌ను తీర్చిదిద్దినట్లుగా తెలిపారు. శారీస్, ఉమెన్స్వేర్, కిడ్స్‌వేర్, డిజైనర్ లాంజ్, వెస్ట్రన్ వేర్, సూటింగ్స్, షర్టింగ్స్, మెన్స్ రెడీమేడ్, మల్టీబ్రాండ్ ఫుట్‌వేర్, ఫ్యాన్సీ జ్యువెల్లరీ వంటి ప్రతి విభాగాన్ని ఫ్యాషన్ ఆధునికతకు అద్దం పట్టేలా రూపొందించినట్లు వివరించారు. ప్రారంభోత్సవ కానుకగా డిస్కౌంట్లు అందిస్తున్నట్లుగా వివరించారు.