Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: బ్యాంకింగ్ రంగంలో ప్రయివేటు దిగ్గజ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ రేటింగ్‌కు కోతపడింది. గ్లోబల్‌రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఐసీఐసీఐ బ్యాంక్ రేటింగ్‌కు కోత విధించింది. వీడియోకాన్ రుణ వ్యవహారంలో క్విడ్‌ప్రోకో ఆరోపణలతో పాటు వివిధ అంశాలలో బ్యాంక్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొంది. బ్యాంక్ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకుకు బీబీ ప్లస్ రేటింగ్ ఇచ్చింది. ఇది వూహాజనిత గ్రేడ్ అని దీని అర్థం. బీబీబీ విభాగంలో వచ్చే పాయింట్లు మంచి రుణ నాణ్యతకు చిహ్నం. ఇప్పటికే ఫిచ్ భారత్‌లో నిర్వహణ వాతావరణానికి కూడా బీబీబీ- నుంచి బీబీ ప్లస్ ర్యాంక్ ఇచ్చింది. గత మూడేళ్లలో బ్యాంకింగ్ రంగ పనితీరు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకొంది. భారత్‌ను ఆసియాలో బీబీబీ రేటింగ్‌లో ఉన్న ఇతర దేశాలతో పోల్చి చూశాము. తలసరి జీడీపీ వంటి కీలక అంశాలను పరిశీలించాము. సరళతర వాణిజ్య వాతారణానికి వచ్చిన ర్యాంకును బట్టి రేటింగ్ ఇచ్చాము అని ఫిచ్ తెలిపింది. భారత్‌లో బ్యాంకింగ్ రంగంలో భారీగా మొండి బకాయిలు ఉన్నాయని పేర్కొంది.