Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఐర్లాండ్ కేంద్రంగా పని చేస్తున్న జెనిత్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేయనుంది. బయో ఫార్మా, వైద్య పరికరాల తయారీ రంగాల్లోనూ తమ సేవలను విస్తరించేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. బయో ఫార్మా, వైద్య పరికరాల తయారీ రంగంలో డిజైనింగ్ ఎండ్ టూ ఎండ్ ఆపరేషన్స్‌ను నిర్వహించేందుకు ఐటీ సేవలకు విస్తరించేందుకు ఈ కొనుగోలు ఉపకరిస్తుందని తాము భావిస్తున్నామని కాగ్నిజెంట్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఐర్లాండ్ కేంద్రంగా పనిచేసే జెనిత్ టెక్నాలజీస్ సంస్థ లైఫ్‌సైన్స్ మ్యానిఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ సర్వీస్ కంపెనీగా ఐరోపాలో మంచి పేరు తెచ్చుకొంది. కాగ్నిజెట్ సంస్థ కొనుగోలు విషయమై జెనిత్ స్పందిస్తూ తమ లైఫ్‌సైన్స్ విభాగంలోకి మరింత మంది వినియోగదారులను చేర్చుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే ఎంత మొత్తం వెచ్చించి జెనిత్ టెక్నాలజీస్ కొనుగోలు చేయనున్నది కాగ్నిజెంట్ అధికారికంగా వెల్లడించలేదు. కాగ్నిజెంట్ సీఈవోగా బ్రయన్ హాంప్రైజ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ సంస్థ మరో సంస్థను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి.