Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యూటీ ఉత్పత్తుల రిటైలర్ సంస్థ నైకా రానున్న ఐదేండ్లలో దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇండియాలో 180 అవుట్లెట్లను ఏర్పాటు చేసే ప్రణాళికతో తాము ముందుకు సాగుతున్నామని సంస్థ రిటైల్ విభాగం సీఈవో అంచిత్ నయ్యర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడతూ తాము ప్రస్తుతం వెయ్యికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులను వెబ్సైట్, యాప్ ద్వారా వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. దీనికి తోడు దేశ వ్యాప్తంగా 41 అవుట్లెట్ల ద్వారా కూడా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తమ సంస్థ 113 శాతం వృద్ధితో రూ.1,229 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించిందని నయ్యర్ తెలిపారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం రూ.578 కోట్లుగా ఉందన్నారు. మగవారి సౌందర్యపోషణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తాము 'నైకా-మెన్' విభాగాన్ని అందుబాటులోకి తెచ్చినట్టుగా ఆయన వివరించారు. దీనికి తోడు ఆకర్షణీయమైన వస్త్రాలను అందించే ఉద్దేశంలో 'నైకా-ఫ్యాషన'ను కూడా తాము అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. బ్యూటీ విభాగంలో ప్రొఫెషన్స్కు అనువైన ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు గాను తాము 'నైకా-ప్రొ' విభాగాన్ని కూడా తాము త్వరలోనే ప్రారంభించనున్నట్టుగా వివరించారు. తమ వ్యాపారంలో హైదరాబాద్ ప్రముఖ మార్కెట్ అని నయ్యర్ తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం పంజాగుట్టలోని సంస్థ స్టోర్లో 'బ్యూటీ బార్'ను నిర్వహిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.