Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: జర్మనీ కార్ల తయారీ దిగ్గజం స్కోడా సెడాన్ విభాగంలో రాపిడ్ సరికొత్త వెర్షన్ కారును అందుబాటులోకి తెచ్చింది. రాపిడ్ రైడర్ పేరుతో సంస్థ ఈ కారును మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.6.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. స్టాండర్డ్వెర్షన్ ర్యాపిడ్ కంటే కొత్త వర్షన్ కారు రూ.1లక్ష చౌక కావడం విశేషం. దీనిలో కొన్ని సరికొత్త ఫీచర్లను ఏర్పాటు చేయడంతో పాటు అందుబాటు ధరను నిర్ణయించింది. దీనిని 1.6 మల్టీ పాయింట్ ఇంజక్షన్ లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో స్కోడా రూపొందించింది. ఈ అత్యాధునిక ఇంజిన్ 105 పీఎస్, 153 ఎన్ఎం పీక్ టార్క్‌తో పరుగులు తీస్తుందని సంస్థ తెలిపింది. లీటరు పెట్రోలుకు ఈ కారు 15.41 కి.మీ. మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. తెలుపు, కార్బన్ స్టీల్ రంగుల్లో ఈ కారు లభిస్తుంది.