Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 మోడల్స్ విడుదల చేసిన సీఎఫ్ మోటో
బెంగళూరు: చైనాకు చెందిన ప్రముఖ మోటార్ సైకిల్స్ తయారీ సంస్థ సీఎఫ్ మోటో భారత్‌లో అడుగు పెట్టింది. సంస్థ తయారు చేసిన సీఎఫ్ మోటో 300ఎన్కే, 650ఎన్కే, 650ఎంటీ, 650 జీటీ మోడల్ బైక్స్‌ను సంస్థ శుక్రవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరను రూ.2.29 లక్షల నుంచి రూ.5.49 లక్షలు (ఎక్స్‌షోరూం- బెంగళూరు)గా కంపెనీ నిర్ణయించింది. భారత్‌లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు గానూ బెంగళూరుకు చెందిన ఏఎండబ్ల్యూ మోటార్‌సైకిల్స్‌లో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టుగా ఈ సంస్థ తెలిపింది. సీఎఫ్మోటో చైనాలో తయారు చేసిన విడిభాగాలను ఏఎండబ్ల్యూ మోటార్ సైకిల్స్ హైదరాబాద్‌లోని తన యూనిట్లో అసెంబ్లింగ్ చేసి విక్రయించనుంది. ఎంట్రీ లెవెల్ బైక్ సీఎఫ్మోటో 300 ఎన్కే స్మార్ట్ ఫీచర్స్‌తో వినియోగదారులకు అందుబాటులోని తెచ్చారు. 6-స్పీడ్ గేర్ బాక్స్, 292 సీసీ ఇంజిన్, 20.5 ఎన్ఎం టార్క్, 33 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. మిగతా మూడు మోడల్స్ అయిన 650 ఎన్కే స్ట్రీట్ ఫైటర్, 650 ఎంటీ అడ్వెంచర్ టౌరర్, 650 జీటీ టౌరర్ వాహనాలు 649 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో రూపొందించారు. 650 ఎన్కే స్ట్రీట్ ఫైటర్ 56 ఎన్ఎం టార్క్ వద్ద 60 బీహెచ్పీ శక్తిని, 650 ఎంటీ అడ్వెంచర్ టౌరర్ 62 ఎన్ఎం టార్క్ వద్ద 69 బీహెచ్పీ శక్తిని, 650 జీటీ టౌరర్ వచ్చి 58.5 ఎన్ఎం టార్క్ వద్ద 60 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తాయి.