Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: హ్యుందారు మోటార్స్ సరికొత్త ఐ10 నియోస్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.4.99లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.70లక్షలుగా ఉంది.ఈ కారులో కూడా 1.2 డీజిల్, పెట్రోల్ ఇంజిన్లనే హ్యుందారు కొనసాగించింది. పెట్రోల్ ఇంజిన్ 82 బీహెచ్పీ, డీజిల్ ఇంజిన్ 74బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తాయి. రెండిట్లోనూ 5 స్పీడ్ మ్యాన్యూవల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లను అమర్చారు.పెట్రోల్ మాన్యూవల్ లీటర్‌కు 20.7కిలోమీటర్లు, ఆటోమేటిక్ 20.2 కిలోమీటర్ల మేరకు మైలేజీ ఇస్తుంది. డీజిల్ రకంలో రెండు వేరియంట్లు 26.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. భారత్ మార్కెట్ అవసరాలకు తగినట్లు ఈ కారును డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కారులో సరికొత్త హెడ్‌ల్యాంప్స్, ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ ఆకారం కూడా సరికొత్తగా ఉంది. ఇంటీరియర్‌ను కూడా పూర్తిగా మార్చేశారు. డ్యాష్ బోర్డులో సరికొత్త 8అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి స్మార్ట్ ఫోన్లను అనుసంధానించుకోవచ్చు. ఇక స్టీరింగ్, ఏసీ వెంట్స్‌ను వెన్యూమోడల్ నుంచి తెచ్చుకున్నారు. వైర్లెస్ ఫోన్ చార్జర్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, రియర్ ఏసీ సౌకర్యాలను ఇందులో ఏర్పాటు చేశారు. డ్యూయల్ టోన్ ఆప్షన్ కూడా హ్యుందారు కల్పించింది.