Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ మార్కెట్లోకి సరికొత్త మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది. సంస్థ తన క్లాసిక్ 350 మోడల్ బైక్‌ను కొంత ఆధునీకరించి బడ్జెట్ ధరలో మార్కెట్లోకి ఆవిష్కరించింది. క్లాసిక్- 350 ఎస్ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్ ధరను సంస్థ రూ .1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గా నిర్ణయించింది. క్లాసిక్ 350 లా డ్యూయల్-చానల్ ఏబీస్ మాదిరిగా కాకుండా క్లాసిక్ 350 ఎస్ లోని 'ఎస్' సింగిల్-చానల్ ఏబీఎస్ను సూచిస్తుంది. ఈ క్లాసిక్ బైక్ 350 ధర రూ.1.54 లక్షల ధరతో పోలిస్తే కొత్త క్లాసిక్ 350 ఎస్ వెర్షన్ ధర రూ.9 వేలు తక్కువ. ఇది ప్యూర్ బ్లాక్, మెర్క్యురీ సిల్వర్ అనే రెండు రంగులలో అందుబాటులోకి వచ్చింది. డిజైన్లోమార్పులు చేసినప్పటికీ, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎస్ అదే 346 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో సంస్థ అందుబాటులోకి తెచ్చింది. 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది 5,250 ఆర్పీఎమ్ వద్ద గరిష్టంగా 19.8 బీహెచ్పీ, 4,000 ఆర్పీఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎస్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్‌ను అమర్చారు. వెనుక భాగంలో ట్విన్ గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. క్లాసిక్ 350 ఎస్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్ , వెనుక భాగంలో ఇప్పుడు డ్రమ్ బ్రేక్ సెటప్‌ను ఏర్పాటు చేశారు.