Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: అతి కొద్దికాలంలోనే స్థిరాస్తి రంగంలో ఉత్తమ సంస్థగా ఎదిగిన హానర్ హోమ్స్ సంస్థ తమ రెండో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టు 'హానర్ అక్వాంటిస్'ను ప్రారంభిచింది. గచ్చిబౌలిలోకి సమీపంలోని గోపన్‌పల్లిలో దాదాపు 10.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును సకల హంగుళతో చేపడుతున్నట్టుగా సంస్థ డైరెక్టర్ స్వప్నకుమార్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో నాలుగు రకాల ప్లాట్లు అందుబాటులో ఉన్నట్టుగా తెలిపారు. ఇప్పటికే వస్త్ర రంగం, రిటైల్ రంగం, కన్జూమర్ డ్యురెబుల్స్, మల్టీబ్రాండ్ మొబైల్ రంగాలలో నాణ్యతకు మారుపేరుగా ఎదిగిన తాము స్థిరాస్తి రంగంలో సరికొత్త పంథాను ఏర్పరిచి రియల్ ఎస్టేట్‌లో కూడా టాప్ కంపెనీగా ఎదుగాలనే థ్యేయంతో ముందుకు సాగు తున్నట్టుగా డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉన్నత విలువలతో క్వాలిటీటైమ్, నిర్ధారిత సమయానికి డెలివరీలే లక్ష్యంగా ఎక్కడ రాజీ పడకుండా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్టుగా సంస్థ మరో డైరెక్టర్ బాలు చౌదరి తెలిపారు. సంస్థలో పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరూపాయికి మరింత విలువ పెరిగేలా కస్టమర్లకు లాభం చేకూర్చేలా నగర జీవనానికి సరిపడేలా ఈ ప్రాజెక్టును రూపొందింస్తున్నట్టుగా సంస్థ సహ వ్యవస్థాపలకులు రాజమౌళి తెలిపారు. వాకింగ్ ట్రాక్, అద్భుతమైన క్లబ్ హౌస్, టెన్నిస్ కోర్ట్, స్విమ్మింగ్‌పూల్‌తో పాటు పలు అత్యాధునిక హంగులతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టుగా హానర్ హోమ్స్ వెల్లడించింది.