Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మందగమనపు ఛాయలు అంతకంతకు విస్తరిస్తున్న వేళ.. దేశంలోని పెద్ద బ్యాంకైన భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆర్థిక వృద్ధిరేటు పట్ల ఆందోళనగా కనిపిస్తోంది. దేశీయంగా డిమాండ్లో నెలకొన్న స్తబ్దత, కీలక రంగాల వృద్ధి పడిపోవడం, పారిశ్రామిక ప్రగతి పడకేయడం, దేశ ప్రజల ఆర్థిక సెంటిమెంట్ క్షీణిస్తున్న వేళ ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాలను అంతకంతకు తగ్గించుకుంటూ పోతోంది. సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో దేశ వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ 1.1 శాతం మేర తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో దేశ వృద్ధిరేటు అంచనాలను పెద్ద బ్యాంక్ 7.3 శాతంగా ప్రకటించింది. అయితే ఆర్థిక వ్యవస్థలో నెలకొంటున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ అంచనాలను తగ్గించుకొని.. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ 6.2 శాతం మేరనే అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంది. తాజాగా ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ వృద్ధి అంచనాలను 5 శాతానికి పరిమితం చేయడంతో ఆర్బీఐ వర్గాల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.