Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'డాక్టర్ కాపర్' బ్రాండ్‌పై ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల ఉత్పత్తులను మార్కెట్లో అందిస్తున్న ఎంఎస్ఆర్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మరో అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్షిప్ అవార్డ్స్-2019 కార్యక్రమంలో ఎంఎస్ఆర్ ఇండియా సంస్థకు ''బెస్ట్-ఇన్-క్లాస్ ఇన్నోవేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్'' అవార్డు దక్కింది. ఇటీవల హైదరాబాద్‌లో ''వరల్డ్ క్వాలిటీ కాంగ్రెస్ అండ్ అవార్స్డ్'' (డబ్ల్యూక్యూసీఏ) సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఎస్ఆర్ ఇండియా సంస్థ సీఈవో డాక్టర్ మల్లారెడ్డి కంపెనీ తరపున ఈ అవార్డును అందుకున్నారు. డాక్టర్ కాపర్ బ్రాండ్‌పై కొత్తకొత్త ఆవిష్కరణలతో ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులను తాము మార్కెట్లోకి తెస్తున్నామని.. తమ సంస్థ అంకితభావానికి గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించడం తమకు నిజంగా గర్వకారణంగా ఉందని మల్లారెడ్డి తెలిపారు. డాక్టర్ కాపర్ ప్రయాణంలో ఈ అవార్డు మరో మైలురాయి అని వ డాక్టర్ మల్లారెడ్డి అనందం వ్యక్తం చేశారు.