Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వారికి ఆర్ధిక సహకారాన్ని అందించేందుకు హెచ్డీఎ ఫ్సీ బ్యాంకు కొత్తగా 'హర్ గావ్ హమరా' పేరుతో ఇంటరాక్టివ్ వాయిస్ (ఐవీఆర్) టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 1800 120 9655 నెంబర్కు రైతులు కాల్ చేయడం ద్వారా అన్నదాతలు ఆర్థిక మద్దతుకు సంబంధించిన సమాచారం పొందవచ్చని సంస్థ తెలిపింది. ఈ నంబరు కాల్ చేస్తే అన్నదాతను బ్యాంక్ సమీపంలోని తమ బ్యాంకు శాఖకు రైతులను కనెక్ట్ చేస్తుందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు ప్రతినిధి రైతు అవసరాలను భర్తీ చేసేందుకు సహకారాన్ని అందిస్తారని పేర్కొంది. దీని ఉద్దేశ్యం బ్యాంకింగ్ సేవలను రైతు ఇంటి వాకిలిలోకీ తోడ్కొని వెళ్లడమని హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూరల్ బ్యాంకింగ్ బిజినెస్ హెడ్ రాజిందర్ బబ్బర్ తెలిపారు. ఈ టోల్ ప్రీ నెంబర్ పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్నదాతలు దీనిని వాడుకోవాలని కోరారు.