Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు 32.8 శాతం వృద్ధితో రూ.7,416.5 కోట్ల నికర లాభాలు సాధించింది. వడ్డీ, వడ్డీయేతర ఆదాయ మద్దతుతో ఆకర్షణీయ ఆర్ధిక ఫలితాలను నమోదు చేసింది. 2018-19 ఇదే క్యూ3లో రూ.5,585.9 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. ఇదే సమయంలో రూ.30,811.27 కోట్లుగా ఉన్న బ్యాంకు మొత్తం ఆదాయం.. క్రితం క్యూ3లో రూ.36,039 కోట్లకు పెరిగినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గడిచిన త్రైమాసికంలో బ్యాంకు నికర వడ్డీపై ఆదాయం 14,172.9 కోట్లకు పెరిగింది. ఇంతక్రితం ఏడాది క్యూ3లో రూ.12,576.8 కోట్ల ఆదాయం నమోద య్యింది. కాగా క్రితం క్యూ3లో బ్యాంకు అడ్వా న్సుల్లో 19.9 వాతం, డిపాజిట్లలో 25.2 శాతం పెరుగుదల చోటు చేసు కుంది. ఇదే సమయంలో బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 1.42 శాతానికి తగ్గాయి. 2018-19 మూడో త్రైమాసికంలో జీఎన్‌పీఏ 1.38 శాతంగా ఉంది. 2019 డిసెంబర్ త్రైమాసికంలో నికర నిరర్ధక ఆస్తులు 0.48 శాతానికి పెరిగాయి. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 0.42 శాతంగా ఉన్నాయి. 2019 డిసెంబర్ 31 నాటికి బ్యాంకు మొత్తం బ్యాలెన్స్ షీట్ రూ.13,95,336 కోట్లకు చేరింది. 2018 డిసెంబర్ 31 నాటికి ఇది రూ.11,68,556 కోట్లుగా ఉంది.