Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఇన్స్టెంట్ కాఫీ తయారీదారు కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ (సీసీఎల్) మార్కెట్లోకి తాజాగా టు ఇన్ వన్ ప్రీమిక్స్ కాఫీని విడుదల చేసింది. ఎలాంటి చక్కెరను కలపకుండా వినియోగించుకునే విధంగా 'దిస్' బ్రాండ్ పేరుతో ఈ కాఫీని తీసుకువచ్చినట్టు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఒక కప్పు వేడి నీళ్లలో ఈ ఇన్స్టెంట్ క్రీమీ కాఫీ పొడి వేసుకుంటే వెంటనే కాఫీ తయారవుతుందని సీసీఎల్ ప్రోడక్ట్స్ మార్కెటింగ్ విభాగం అధిపతి ప్రీతమ్ పట్నాయక్ పేర్కొన్నారు. ఒక సాచెట్ ధరను రూ.10గా నిర్ణయించినట్టు ఆ కంపెనీ పేర్కొంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్లో పది సాచెట్లతో కూడిన బాక్స్‌తో ఈ కాఫీ లభిస్తుందని తెలిపింది. కాగా త్వరలో అన్ని ప్రధాన సూపర్ మార్కెట్లు, ఎంపిక చేసిన కిరాణా షాపుల్లో కూడా అందుబాటులోకి తేనున్నట్టుపేర్కొంది.