Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన నూతన ప్రీమియం హ్యాచ్బ్యాక్ 'ఆల్ట్రోజ్' కారును బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. న్యూఢిల్లీలో దీన్ని ఆ కంపెనీ ప్యాసింజర్ వెహికల్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ ఆవిష్కరించారు. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో, ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్తో టాటా ఆల్ట్రోజ్ ఇవి కారును తీర్చిదిద్దినట్లు ఆ కంపెనీ తెలిపింది. బీఎస్-6 ఉద్గార నిబంధనలకనుగుణంగా తీర్చిదిద్దిన పెట్రోల్ వెర్షన్ కారు ప్రారంభం ధర రూ. 5.29 లక్షలుగా, డీజిల్ వెర్షన్ ధర రూ.6.99 లక్షలుగా నిర్ణయించింది.