Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌదీ యువరాజుపై ఆరోపణలు
వాషింగ్టన్: ప్రఖ్యాత ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఫోన్ 2018లో హ్యాకిం గ్‌కు గురైనట్టు సమాచారం. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వ్యక్తిగత మొబైల్ నుంచి పంపిన ఓ వాట్సాప్ సందేశం వల్లే హ్యాకింగ్ జరిగినట్టు ప్రముఖ ఆంగ్ల పత్రిక గార్డియన్ తన కథనంలో పేర్కొంది. ఆ సందేశం ద్వారా ఓ హానికరమైన వైరస్ బెజోస్ ఫోన్లో చొరబడినట్టు ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. వీరివురి మధ్య 2018, మే 1న జరిగిన స్నేహాపూర్వక చాటింగ్‌లో భాగంగా పంపిన ఓ వీడియో సందేశం ద్వారా బెజోస్ ఫోన్లో వైరస్ చొరబడినట్టు గుర్తించారు. దీని వల్ల ఆయన ఫోన్లోని సమాచారం భారీ స్థాయిలో తస్కరణకు గురైనట్టు గుర్తించారు.
అది ఎటువంటి సమాచారం అన్నది మాత్రం తెలియరాలేదు. బెజోస్ కూడా తన ఫోన్ హ్యాకింగ్‌కు గురైందని సల్మాన్‌పై ఆరోపణలు చేశారు. పశ్చిమ దేశాల పెట్టుబడిదారులను ఆకర్షించాలన్న యువ రాజు ప్రయత్నాలపై ప్రభావం పడే ప్రమాదం ఉం దని విశ్లేషణలు వెలువడుతున్నాయి. బెజోస్ వ్యక్తిగత జీవితంపై 'నేషనల్ ఎంక్వైరర్' అనే పత్రిక పలు రహస్య విషయాలను ప్రచురించిన విషయం తెలి సిందే. మొబైల్ సందేశాలతో సహా వెల్లడించడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ సందే శాలతో ఆయన వివాహేతర సంబంధం వెలుగు లోకి వచ్చింది. దీంతో ఆయన భార్య మెకంజీ.. బెజోస్‌కు విడాకులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా హ్యాకింగ్ అంశంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. కాగా, తాజా అం శంపై అమెరికాలోని సౌదీ రాయబార కార్యా లయం స్పందించింది. బెజోస్ ఫోన్ హ్యాకింగ్‌లో సౌదీ హస్తం ఉందని మీడియాలో వస్తున్న కథనాలు అర్ధంలేనివని వ్యాఖ్యా నించింది. దీనిపై వెంటనే విచారణ జరిపి నిజాలేంటో తేల్చాలని డిమాండ్ చేసింది. సౌదీ యువ రాజుపై అమెజాన్ అర్థరహిత ఆరోపణలు చేస్తోందని మండిపడింది.