Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
ప్రీమియం హచ్ బ్యాక్ విభాగంలో 'అల్ట్రో జ్' కారును అత్యంత సురక్షిత మైన వాహనం గా తాము అందుబాటు లోకి తెచ్చినట్టు గా టాటా మోటార్స్ గ్లోబల్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ బోస్ తెలిపారు. శుక్రవారం ఆయన తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి అల్ట్రోజ్ కారును అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ జీన్పీఏపీ 5 స్టార్ రేటెడ్ ప్రమాణాలతో అల్ట్రోజ్ను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఇది సురక్షిత డిజైన్, డ్రైవింగ్ డైనమిక్స్, టెక్నలాజీ, వినియోగదారుల ఆనందాలకు నెలవుగా ఉంటుందన్నారు. పరిశ్రమలో తొలి పూర్తి స్థాయి బీఎస్6 సన్నద్ధత కలిగిన డీజిల్ హచ్బ్యాక్ వాహనం అన్నారు. ఇందులో పెట్రోల్ వర్షన్ ప్రారంభ ధర రూ.5.29 లక్షలు, డీజిల్ వర్షన్ ధర రూ.6.99 లక్షలుగా నిర్ణయించామన్నారు. కాగా గతేడాది ఇవిష్కరించిన టియాగో, టిగోర్, నెక్సాన్లను ఆధునీకరించి అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుత ఏడాది ద్వితీయార్థంలో వాహన పరిశ్రమ పుంజుకోవచ్చన్నారు. భారత మార్కెట్లో ప్రీమియం హచ్బ్యాక్లో అన్ని కంపెనీలకు సంబంధించి ప్రతీ నెల 40 వాహనాల విక్రయాలు జరుగుతున్నాయన్నారు.