Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.120.06 కోట్ల కన్సాలిడెటెడ్ నష్టాలు నమోదు చేసింది. 2018-19 ఇదే క్యూ3లో రూ.122.61 కోట్ల నికర నష్టాలు చవి చూసింది. ఇదే సమయంలో రూ. 1,109.28 కోట్లుగా ఉన్న కంపెనీ కన్సాలిడేటెడ్ నికర ఆదాయం.. క్రితం క్యూ3లో రూ.1,156.15 కోట్లకు పెరిగినట్లు శుక్రవారం ఆ కంపెనీ బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. శుక్రవారం బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్ రూ.1.74 శాతం పెరిగి రూ.4.10 వద్ద ముగిసింది.