Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తమ అనుబంధ సంస్థ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్)ను ఏ సంస్థలోనూ విలీనం చేసే యోచన లేదని సోమవారం ఎల్ఐసీ స్పష్టం చేసింది. ఐడీబీఐలో ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ను కలిపేస్తున్నారని రిపోర్టులు రావడంతో ఎల్ఐసి ఈ ప్రకటన చేసింది. అలాంటి విలీన ప్రతిపాదనేది ఎల్ఐసీ వద్ద లేదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఐడీబీఐ బ్యాంకు కూడా కొట్టిపారేసింది. తమ బోర్డులో ఇలాంటి అంశంపైనా ఎప్పుడు చర్చ జరగలేదని పేర్కొంది. ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ను ఐడీబీఐలో విలీనం చేస్తున్నారనే రిపోర్టులతో సోమవారం ఇంట్రా ట్రేడింగ్లో ఎల్ఐసీిహెచ్ఎఫ్ షేర్ విలువ 10 శాతం పతనమైంది. తుదకు 7.71 శాతం నష్టపోయి రూ.380.30 వద్ద ముగిసింది. ఐడీబీఐ బ్యాంకు షేర్ కూడా 2.54 శాతం కోల్పోయి రూ.34.50 వద్ద ముగిసింది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసి 51 శాతం వాటా కలిగి ఉంది. గడిచిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అధిక మొండి బాకీల వల్ల రూ.4,185.48 కోట్ల నష్టాలు చవి చూసింది. 2019 డిసెంబర్ ముగింపు నాటికి ఈ బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు ఏకంగా 28.72 శాతానికి ఎగిశాయి.