Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఇండియా సాఫ్ట్'లో ఒప్పందాలు
సైబరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన ఇండియాసాఫ్ట్, గ్లోబల్సాఫ్టల్లో చిన్న, మధ్య స్థాయి సాఫ్ట్వేర్ కంపెనీలు 10 కోట్ల డాలర్ల (దాదాపు రూ.730 కోట్లు) విలువైన సాఫ్ట్వేర్ ఎగుమతుల ఒప్పందాలు జరిగినట్టు నిర్వాహక కమిటీ చైర్మెన్ నలిన్ కోహ్లీ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సదస్సుల్లో అమెరికా ఎగ్జిబిటర్లు కూడా తమ అధునాతన ప్రాజెక్టులను, ఉత్పత్తులను ప్రదర్శించారని పేర్కొన్నారు. ఈ సదస్సుల వేదికగా 400 ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ఇండియా సాఫ్ట్‌కు దాదాపు 50 దేశాల నుంచి 350 మంది కొనుగోలుదారులు హాజరయ్యారన్నారు.