Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రయివేటు వైద్య బీమా కంపెనీ మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఇఓగా కష్ణన్ రామచంద్రన్‌ను నియమించినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మాక్స్ బుపా తదుపరి దశ వద్ధిని నడిపిం చడానికి కష్ణన్ బాధ్యత వహిస్తాడని పేర్కొంది. కష్ణన్ను మాక్స్ బుపా కుటుంబానికి స్వాగతిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని మాక్స్ బుపా బోర్డు చైర్మెన్ సిబి భావే తెలిపారు. ఆరోగ్య భీమా పరిశ్రమపై అతని లోతైన జ్ఞానం మరియు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విభిన్న అనుభవం, స్థిరమైన, లాభదాయక వద్ధిని అందించడంలో అతని ట్రాక్ రికార్డ్ మాక్స్ బుపాకు అమూల్యమైందన్నారు.