Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ మార్గనిర్దేశకాల ప్రకారం హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు ఐకియా ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. నగరంలో 'క్లిక్ అండ్ కలెక్ట్' అనే సురక్షితమైన, కాంటాక్ట్‌లెస్ షాపింగ్ అనుభవాన్ని ఆవిష్కరించినట్లు పేర్కొంది. ప్రస్తుత సమయంలో ఇంట్లో ఉంటూనే తమకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని తెలిపింది. ఫర్నీచర్, కుకింగ్ ఎస్సెన్షియల్, పిల్లల ఫర్నీచర్, వస్త్రాలు తదతర ఉత్పత్తులను సౌకర్యవంతంగా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఈ ఉత్పత్తులను ఐకియా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి.. అనంతరం నియమిత సమయంలో తమ స్టోర్ వద్ద క్లిక్ అండ్ కలెక్షన్ స్టేషన్లో పొందవచ్చని తెలిపింది.