Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యస్ బ్యాంక్, జెఅండ్‌కె బ్యాంక్‌లకు డిఫాల్ట్
న్యూఢిల్లీ : యస్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌కు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ రుణాలు చెల్లించడంలో విఫలమైంది. మే 1 నాటికి ఆయా బ్యాంక్‌లకు రూ.29.55 కోట్ల వడ్డీ చెల్లించలేకపోయినట్టు స్టాక్ ఎక్సేంజీలకు రిలయన్స్ ఇన్ఫ్రా సమాచారం ఇచ్చింది. ఈ కంపెనీ యస్ బ్యాంక్ నుంచి రూ.3,627 కోట్లుగా అప్పుగా తీసుకుంది. అదే విధంగా జెఅండ్‌కె బ్యాంక్, శ్రేయా ఈక్విప్మెంట్ ఫైనాన్స్‌కు రుణాలు చెల్లించడంలో విఫలమైనట్టు ఏప్రిల్ 30న తెలిపింది. యస్ బ్యాంక్కుకు రూ.944 కోట్ల అసలు రుణం చెల్లించాల్సి ఉంది. కాగా రిలయన్స్ రూ.6,267 కోట్ల స్వల్ప, దీర్థకాల రుణాలు పొంది ఉంది.