Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జీఎస్టీ రిటర్న్ దాఖలును మరింత సులభతరం చేయడంలో భాగంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ (జీఎస్టీఎన్) ఇప్పుడు శూన్య (నిల్) జీఎస్టీఆర్ -3బీ రిటర్న్‌ను ఎస్ఎమ్మెస్ ద్వారా దాఖలు చేసే సౌలభయాన్ని తీసుకువచ్చింది. తమ నమోదిత మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చు. తమ దగ్గర నుంచి ఎలాంటి ఔట్‌వార్డ్ సరఫరా, అలాగే లయబిలిటీ (రివర్స్ చార్జ్ లయబిలిటీ సహా)ఒక నెలలో లేకుంటే నిల్ జీఎస్టీఆర్-3బీ దాఖలు చేయవచ్చు. పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్ విధానంలో సైతం నిల్ రిటర్న్‌ను దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ సదుపాయం ద్వారా 20 లక్షల మందికి పైగా జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారని అంచనా. మొత్తం జీఎస్టీ చెల్లింపుదారుల్లో 20శాతం మంది లబ్ది చేకూరనున్నది.
ఎస్ఎంఎస్ ద్వారా నిల్ జీఎస్టీఆర్-3బీని ఎలా ఫైల్ చేయాలంటే
పన్ను చెల్లింపుదారులు ముందుగా ఎస్ఎంఎస్ను ‘NIL<space>3B<space>GSTIN<space> MMYYYY (ట్యాక్స్ పీరియడ్)ఫార్మాట్లో 14409 కు తమ నమోదిత మొబైల్ నెంబర్ నుంచి పంపవలసి ఉంటుంది. ఉదాహరణకు, మే 2020 నెలకు రిటర్న్ దాఖలు చేయాలనుకుంటే పన్ను చెల్లంపుదారుడు 09AGBPS5577MSZC జీఎస్టీఎన్ నెంబర్ కలిగి ఉంటే అతను NIL 3B 09AGBPS5577MSZC 052020 అని 14409కు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది.
ఎస్ఎంఎస్ పంపిన తరువాత పన్ను చెల్లింపుదారుడు ఆరు సంఖ్యల వెరిఫికేషన్ కోడ్‌ను ఎస్ఎంఎస్ ద్వారా అందుకుంటారు. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు మరో ఎస్ఎంఎస్ను CNF<space>3B<space>06 digit verification code ను 14409కు పంపవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒకవేళ వెరిఫికేషన్ కోడ్ 782503 అయితే దానిని CNF 3B 782503 అని 14409 కు పంపాలి. చివరగా, రిటర్న్ దాఖలు విజయవంతమైన విషయం అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ (ఏఆర్ఎన్)గా అందుతుంది. ఈ దాఖలుచేసిన రిటర్న్ అప్లికేషన్ యొక్క స్టేటస్ ను జీఎస్టీ పోర్టల్ లో Services > Returns > Track Return Status వద్ద చూడవచ్చు.
జీఎస్టీ నెట్వర్క్ (జీఎస్టీఎన్) సీఈవో శ్రీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ " దాదాపు ఒక కోటి మందికి పైగా పన్ను చెల్లింపుదారులు తమ నెలవారీ రిటర్న్స్‌ను జీఎస్టీఆర్-3బీపై ఫైల్ చేస్తుంటే వారిలో దాదాపు 20% మంది నిల్ రిటర్న్ ఫైల్ చేసే వారు అవుతారు. ఇప్పుడు తీసుకు వచ్చిన ఎస్ఎంఎస్ ఫైలింగ్‌తో ఈ తరహా వ్యాపారాలకు జీఎస్టీ సమ్మతి మరింత సులభతరం అవుతుంది. వీరిలో చాలామంది ప్రభుత్వం మరియు ఇతర సంస్థల నుంచి కాంట్రాక్టులు పొందడానికి అర్హత కోసం రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. రెగ్యులర్‌గా వ్యాపారాలు చేసేవారు కాదు'' అని అన్నారు.
ఎస్ఎంఎస్ ద్వారా నిల్ జీఎస్టీఆర్-3బీను పన్ను చెల్లింపుదారులు ఈ క్రింది సందర్భాలలో ఫైల్ చేయవచ్చు
- పన్ను చెల్లింపుదారుడు సాధారణ పన్ను చెల్లింపుదారుడుగా క్యాజువల్ ట్యాక్స్‌పేయర్‌గా/సెజ్ యూనిట్‌గా/సెజ్ డెవలపర్ గా నమోదితమై సరైన జీఎస్టీఐఎన్ కలిగి ఉండాలి.
- జీఎస్టీ పోర్టల్‌పై ఆధీకృత సంతకం మరియు మొబైల్ నెంబర్ నమోదితమై ఉండాలి
- పన్ను, వడ్డీ లేదా ఆలస్యపు రుసుములకు సంబంధించి గతంలో ఎలాంటి పెండింగ్లూ ఉండరాదు.
- గతంలోని జీఎస్టీఆర్ 3బీ రిటర్న్స్ అన్నీ కూడా సరిగా ఫైల్ చేయబడి ఉండాలి
- ఫార్మ్ జీఎస్టీఆర్-3బీ ఆన్లైన్ వెర్షన్‌కు సంబంధించి ఎలాంటి సమాచారమూ సేవ్ చేయబడదు.
నిల్ జీఎస్టీఆర్-3బీకు సంబంధించిన ఫైలింగ్‌ను ఏ సమయంలో అయినా లేదా రిటర్న్ ఫైల్ చేసిన తరువాత నెల మొదటి తేదీ లోపుగా ఫైలింగ్ చేయవచ్చు. ఉదాహరణకు, మే 2020 నెల కోసం, నిల్ రిటర్న్‌ను జూన్ 01,2020 తరువాత ఫైల్ చేయాలి. సంబంధిత జీఎస్టిన్కు సంబంధించి ఆధీకృత ప్రతినిధులు నిల్ జీఎస్టీఆర్ -3బీని ఎస్ఎంఎస్ ద్వారా ఫైల్ చేయాల్సి ఉంటుంది. అర్హతకు సంబంధించి మరిన్ని వివరాలు మరియు నిల్ జీఎస్టీఆర్-3బీ రిటర్న్‌కు సంబంధించిన ఫైలింగ్‌ను జీఎస్టీ పోర్టల్ పై హెల్ప్ విభాగం వద్ద పొందవచ్చు.