Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4.10 లక్షల మందికి పైగా ప్రమోషన్ : సహారా
లక్నో : తమకు సంబంధించిన పలు సంస్థలలో పని చేసే ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తారని వస్తున్న వార్తలపై సహారా ఇండియా పరివార్ స్పందించింది. కరోనా సంక్షోభం, లాక్డౌన్ల కారణంగా 'సహారా' కూడా తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించకూడదన్న ధృఢ నిర్ణయాన్ని సంస్థ తీసుకున్నది. అందరు ఉద్యోగులూ పూర్తి భద్రతతో పని చేస్తారని వివరించింది. ఈ మేరకు ఒక ప్రకటనను సహారా విడుదల చేసింది. అంతేకాకుండా, 4.05 లక్షల మంది ఫీల్డ్ వర్కర్లకు క్యాడర్ ప్రమోషన్, 4,808 మంది ఆఫీస్ వర్కర్లకు ప్రమోషన్‌తో పాటు జీతాలను పెంచినట్టు పేర్కొన్నది. ప్రస్తుతం సహారాకు సంబంధించిన పలు సంస్థలలో 14 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. కోవిడ్ కారణంగా తిరిగి సొంత స్థలాలకు చేరుకుంటున్న వలస కార్మికులను ఆదుకోవడానికి సహారా ప్రయత్నిస్తున్నదని వివరించింది. ఇందులో భాగంగా సదరు వ్యక్తుల అర్హతను బట్టి వారికి నియమించుకోవాలని చూస్తోందని సహారా పేర్కొన్నది. 1978లో స్థాపించబడిన సహారా సంస్థ.. పలు రంగాల్లో తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నది.