Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ టెక్నాలజీ సామర్థ్యం కలిగిన ఈ-కామర్స్ పరిశ్రమకు లాజిస్టిక్స్ పరిష్కారాలు అందజేసే ఈకామ్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుత ఆర్థిక, ఉద్యోగ అస్తవ్యస్త పరిస్థితిలోనూ 7000 పైగా ఉద్యోగాలను నియమించటానికి కసరత్తు చేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. రాబోయే రెండు నెలల్లో లాస్ట్‌మైల్ డెలివరీ, వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్సెస్ వంటి కార్యకలాపాలలో పూర్తికాలం నియామకాలు చేపట్లనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త ఉద్యోగాలు కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 25 శాతంకు ప్రాతినిథ్యం వహించబోతున్నవని వెల్లడించింది. హైదరాబాద్ సహా పలు కీలక నగరాల్లో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని ఈకామ్ ఎక్స్‌ప్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పౌరఖ్ దీప్ సింగ్లా తెలిపారు. వచ్చే పండుగ సీజన్ ప్రారంభం అయ్యే లోపల 35,000 ఉద్యోగులను నియమించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.