Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జాతి వివక్ష, సౌందర్య ప్రామాణికతపై ప్రపంచవ్యాప్త చర్చ జరుగుతున్న నేపథ్యంలో బహుళజాతి ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ప్రధాన బ్రాండ్ ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి 'ఫెయిర్' అనే పదాన్ని తొలగించేందుకు నిర్ణయించినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు దీన్ని రీబ్రాండ్ చేయనున్నట్టు పేర్కొంది. ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకేజీ మీద 'ఫెయిర్/ఫెయిర్‌నెస్', 'వైట్ వైట్నింగ్, 'లైట్, మెరుపు' వంటి పదాలను కూడా తొలగించినట్టు హెచ్‌యూఎల్ చైర్మెన్ సంజీవ్ మెహతా వెల్లడించారు. ప్యాకెట్‌పై ఉండే రెండు ముఖాలతో పాటు మరో నల్ల ముఖాన్ని తొలగించామన్నారు. రెగ్యులేటరీ ఆమోదం అనంతరం కొత్త పేరుతో మరికొద్ది నెలల్లో వినియోగదారుల ముందుకు రానున్నామని వెల్లడించారు. రీబ్రాండింగ్‌లో దేశవ్యాప్తంగా వివిధ చర్మ రంగుల మహిళలను గౌరవిస్తూ, వారి ప్రాతినిధ్యంతో విభిన్నంగా ఉండ బోతున్నాయన్నారు.