Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకులు తొడిగిన చెట్లుకు
పెరిగిన ఆకుపచ్చ ఆకాశంలో
కొండ కోనల్లో గిరి లోయల్లో
కదిలే జీవన వనాలు
మలుపుల దారంతా
గుండె బిగిసిన మత్యుహస్తాలు
భయద సౌందర్య అరణ్యంలో
మగ నయిని విహ్వల విషాదం
గాలిలో
మరణ మదంగాలన్నీ మోగెను
విద్యుల్లతల తిమిర ద్వారంలో
శ్రీశైలంలో
కష్ణా నది ఎడమ గట్టు
జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం వేదిక
ఆ సీమలో
జల జలకాల తరగంగాలన్నీ
వెలుగులీను వేళ
సాంకేతిక విజ్ఞాన సుమ పరిమళం
అగ్ని పునీతమైన సజీవులు
మనిషి మరణం ఎంత దారుణం
విద్యుక్త సేవలో దీర్ఘనిద్ర శాశ్వతం
మతులై మెరిసే నింగి తారలుగా
ప్రకతి ఒడిలో అమర జీవులే సదా
(శ్రీ శైలం దుర్ఘటనలో మతి చెందిన ఇంజినీర్లకు నివాళిగా...)
- డా.టి.రాధాకష్ణమాచార్యులు
9849305871