Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూసిన కనురెప్పల్ని తెరిపించి
కలల లోకంలోకి పంపిస్తారు తల్లిదండ్రులు
గురువు మాత్రం ఆ కలల్ని సాకారం చేసుకునేందుకు రహదారి వేస్తాడు
గుండెలోని చెమటను
అక్షరాలుగా పోతపోసి
మాటల మూటలతో
వంతెనల్ని నిర్మిస్తాడు
క్వశ్చన్ మార్క్ ఫేసులో ఆశ్చర్యార్థకాన్ని నింపి ,
అద్బుతాల ఆకాశానికి నిచ్చెనలు వేసే కిటుకులు నేర్పిస్తాడు
సమాజం పుంజీతంలో పులుల నుండి
కాపాడుకునే ప్రణాళిక చూపిస్తాడు
అవసరమైతే తరిమికొట్టే వ్యూహాల్ని రచింపచేస్తాడు
అతని మెదడొక తేనెతెట్టె
తన బోధనలతో మధువును ప్రవహింపజేస్తుంటాడు
విద్యార్థులు గ్రోలేలా..
విజ్ఞాన బీజాల్ని పంచుతుంటాడు
శిష్యులు జ్ఞానవృక్షాలవ్వాలనీ...
మోడు వారే కొమ్మలు కూడా చిగురించే రెమ్మలు కావాలని తపనపడుతుంటాడు.
మీ బోధన స్ఫూర్తితో
ఉన్నత స్థాయికి ఎదిగానని శిష్యులు చెప్పగానే
తబ్బిబ్బై మనసులో గంతులేస్తాడు
చంటి పిల్లాడిలా
నా స్టూడెంట్స్ అని కాలరెగరేసి చాటింపువేసే అల్పసంతోషి ఆచార్యుడు
ఎర్రోజు వెంకటేశ్వర్లు
వైస్ ప్రిన్సిపాల్
TSWR డిగ్రీ కళాశాల
నిర్మల్ .
9110535342