Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏటిపక్కన ఎవుసమంటే.. కాట్లె ఉన్నట్టే
ఒరుపుకాలం పండదు
వరదకాలం పండదు
ఏ తుఫానులొచ్చినా
ఏ వాయుగుండాలొచ్చినా మాకే గండం
మా కంటికరకట్టలే తెగుతై
ఏ చెరువుకట్టకు బుంగవడ్డా
మా పంటకే గండివడ్తది
వాగు ఊటగ పారితే
పెట్టుబడి గంగల కల్తది
నారుమడిసుట్టు మేరువగప్పుతది
యేడాది గాసం ఏటి పాలైతది
సుట్టూర పచ్చని పొలాలు
నురుగలుగక్కుతూ వాగు
నడిమిట్ల కయ్యగోసిన బత్కు మాది
తడలను సూసి ముర్సినంత మాత్రాన
మా పేగులు తడ్తయా?
మా గుండెదరులు కూలుతాంటే
ఆదుకునే ఆసాములేరి?
ఏనాడన్న
రాశంగ పండిందున్నదా.. తిన్నదున్నదా?
ఎప్పుడూ మెరిగలేర్కతినే బత్కులేనాయే..
ఓ సార్లు..
పంటనష్టం రాస్కపోనొచ్చేటప్పుడు
మా మన్సుగాయం కొలిసే
అతార ఏదన్నుంటె తేండ్రి
థూ.. బత్కు
సముద్రం తలాపునుందని మురువాల్నో
దూప తీరుతలేదని ఏడువాల్నో
అర్థమై సావదు.
- వడ్లకొండ దయాకర్,
9440427968