Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్ఞాన మెప్పటికీ తమ గుప్పెట
బందీగా ఉండాలన్న
అగ్రవర్ణ దురాలోచన
వాని కొస నాలుకపై కొలువుంటుందని
కలలనైన తలచవైతివి
ఆకుమాటున
ఆకువోలే
దాగివుండే పిట్టముక్కుకు
ఎక్కుబెట్టే విలుకాడివైనా
కానవైతివి వాని కుట్రను
నింగి తాకే త్యాగ గుణమూ
సంద్రాన్ని మించిన నిండు మనసూ
ఉండీకూడ .. నా తండ్రీ!
నీవెరుగవైతివిజి
ద్రోణ(హ) బుద్ది
ఎంత వెర్రిబాగుల వాడివిరా
నా తండ్రీ!
ఆ తండ్రి రూపాన్నే నీ హదయ పీఠాన
నిలుపుకునిజి
నేర్వనెంచితివి
సకల శస్త్ర విద్య లెల్ల
నీ గుండెనే
గురు పీఠమ్ముగా జేసితివి
నీ గురియేల వానికి
గుబులాయెనో తండ్రి
నీవె గురువని మొక్కినందుకు
గొప్ప కోరికే కోరినాడు
తాను నేర్పని విద్యకు
నీ బొటన వేలునే మింగేసినాడు
నేడు సైతం
నాటి ద్రోహం జడలు విప్పి
కబళించుతుంటే జనం బతుకులు
లేదు వేరొక దారి తండ్రీ
మనువు గుండెలు చీల్చి వేయగ
వామ హస్తపు బొటనవేలికి
పదును పెట్టి
ఎక్కుబెట్టర గురిపెట్టి శరములు...
- డా. కట్టా సత్య ప్రసాద్
94900 98918