Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రిమ్ యా హసయాత్ర' ఫాంటసీ కథతో మొదలైన 'తోవ' జయకేతనం ఎగుర వేయడ మెలాగో తెలిపే వరకు సాగింది. కొండవీటి మధుసూదన్‌రెడ్డి గారి తోవ'లో కథలే కాకుండా అతి ముఖ్యమైన వ్యక్తిత్వ వికాస వ్యాసాలు న్నాయి. ఇవి ప్రతి ఒక్కరి జీవి తాలని స్పశిస్తాయని నా బలమైన నమ్మకం. ప్రకతిలోని సకల జీవాలు మనిషిని ప్రశ్నిస్తున్న వైనం కరోనా అస్రం కథలలో కళ్ళకు కట్టాయి.
కరోనా సమయంలో జరిగిన కొన్ని యదార్థ సంఘ టనల ఆధారంగా రాసిన కథలు మనలోని మానవ త్వాన్ని తట్టి లేపుతాయి. తన చుట్టూ వున్న సమాజంలో జరిగే సంఘటనలనే కథా వస్తువులుగా మలిచినట్టుగా అన్పించింది.
ఒక తల్లి విజయగాథ చదువుతున్న ప్పుడు కష్ట సమయంలో పిల్లలు తల్లిదండ్రులకు ఎలా సహకరించాలో, వారు ఏ పద్ధతిలో చదివితే ఎక్కువ ప్రయోజకుల వుతారో కళ్ళకు కట్టారు రచయిత. అనుమానం రోగం ముదిరి నపుడు మంచి మనుషులు కూడ ఎలా పతనం అవుతారో వివరించారు. 'ధూం' కథలో హాస్యంతో పాటు పెడదారి పెట్టే యువతకు హెచ్చరిక చేశారు.
సమయం విలువను చెప్పే పద్ధతి మనకే మొట్టికాయలు వేస్తు న్నట్లుగా ఉంటుంది. పిల్లల పై చూపించే అతి ప్రేమ అనర్ధదా యకమని 'బంగారు పంజరం'లో హాస్యంతోటే కఠినమైన వాస్తవాలను వెల్లడించారు. 'సాకులు చెప్పడం ఒక పెద్ద రోగం' చదువుతున్నప్పుడు అవసరార్థం నేను చిన్నప్పటి నుండి ఏయే సందర్భాలలో సాకులు చెప్పానో గుర్తుకు వచ్చి బాధ కలిగి, కన్నీరొచ్చింది.
స్ఫూర్తి ప్రదాతలో సోమేశ్వర్ యొక్క పాత్ర ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని స్తుందనడంలో అతిశయోక్తి లేదు. మేనరికపు పెళ్ళిళ్ళు పిల్లలకు, కుటుంబానికి ఎలా శాపాలుగా మారుతాయో వివరించిన 'ఈ పాపం ఎవ్వరిది' కథ చదువుతున్నప్పుడు నా స్నేహితురాలు అనుభవిస్తున్న బాధ నా కళ్ళ ముందు కన్పించింది.
నేటి సామాజిక, రాజకీయ చిత్రాన్ని ఎలాంటి ముసుగు లేకుండా ఆవిష్కరించిన కథ 'వీళ్ళ తప్పేంటి'. 'గమ్యం' కథ చదువు తున్నప్పుడు మా అమ్మాయి శివానినే గుర్తు కొచ్చింది. తను కూడా తన గమ్యాన్ని చేరడం కోసం శాస్త్రీయ నత్యం నేర్చు కుంటుంది.
విద్యార్థులు తల్లిదండ్రులకు సహకరిస్తూ ఎలా చదువుకోవాలో నేర్పించారు. ఉపాధ్యాయులు ఎలా ఉత్తమ ఉపాధ్యాయులు కావాలో సూచించారు. తల్లిదండ్రులు వాళ్ళ పాత్రను ఎలా పోషించారో చాలా వివరణాత్మకంగా, సందర్భోచితంగా, అనుభవ పూర్వకంగా పేర్నొన్నారు. ఇవన్నీ నేర్చుకోవడానికి నాకు తోడ్పడ తాయని భావిస్తు రచయితకు కతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. ఇంతమందికి ఉపయోగ పడే ఈ 'తోవ' పుస్తకం 'టెక్స్ట్ బుక్' కాకుండా మరేమవు తుంది? ఈ పుస్తకం అమేజాన్‌లో లభ్యమ వుతుంది.
- వి.రమాదేవి ఎమ్.ఎ, టి.పి.టి.