Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోటి కోయిలలు కొలువు దీరిన గళం
జట్టు గట్టిన తేనెటీగలన్నీ
ఒక్క చోటే మధువును గుమ్మరించిన స్వరం
నీ ఉచ్ఛ్వాసలో ఉద్భవించే సరిగమలు
నిశ్వాసలో నిబిడీకతమైన సంగతులు
రాగాల సరాగాలు హదయ స్పందనలు
పాట కోసం నువ్వు పుట్టావో
పాటే నీ కోసం పుడుతుందో
పల్లవించిన ప్రతీ పాట
పచ్చి పాలంత కమ్మదనం
భాషా భేదాలు లేని పాట
భారతావని మూలమూల్లో నాదమై మ్రోగిన పాట
ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ ల్లో
ఎన్నింటి లోనో పరుచుకున్న జ్ఞాన పరిమళాలు
ఎన్ని లేలేత గళాలను చేరదీసి
స్వర గురువుగా గమకాల రహస్యాలు విప్పి చెప్పావో
ఎన్నెన్ని వేదికలను రాగాల పూదోటలను చేసి
రసరమ్య గీతాల మధురిమను పంచావో
శిలలకు చలనాన్ని నేర్పిన వాడా
అలలకు సంగీతాన్ని అద్దిన వాడా
నీ గానం గాయపడిన హదయాలకు గంధలేపనం
నీ పాట కోట్లాది అభిమానుల పారవశ్యం
వచ్చిన పని అయిపోయిందని
పుట్టిన జన్మ ధన్యమైందని
మౌనిలా, మౌనంగా నీ దారిన నువ్వు వెళ్లిపోయావు
నలభై వేలకు పైగా నువ్వు వెలిగించిన స్వర దీపాలు
నాలుగు దిక్కులా రాగ వెలుగులు పంచుతూనే ఉంటాయి
మూగ బోయిన నీ గొంతు
ప్రజల నాల్కలపై పాటై ప్రతిధ్వనిస్తుంది
నువ్వు లేవు...
పుడమి ఉన్నంత వరకు
నీ పాట ప్రజల్ని పులకరింపజేస్తూనే ఉంటుంది.
- గాజోజు నాగభూషణం,
98854 62052