Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1931 జులై 1న గుంటూరు జిల్లా వేజండ్ల గ్రామంలో విశ్రాంతమ్మ, రామయ్య దంపతులకు ఇనాక్ జిన్మించారు. కథ, కవిత, నవల, నాటకం, విమర్శ, పరిశోధన, అనువాదం తదితర అంశాలపై 100కి పైగా పుస్తకాలు రాసారు.
తెలుగు నాటక చరిత్రలోనే కాదు భారతీయ నాటక చరిష్ట్రత్రలో 'మునివాహనుడు' నాటిక అరు లక్షలకు పైగా ప్రతులు ముద్రణ అవ్వడం, కళాశాల విద్యార్థులకు అదే పాఠ్యాంశం అవ్వడం ఓ ప్రపంచ రికార్డ్. అనేక పరిశోధనా పత్రాలు సమర్పించారు.
అందరు పేదలులాగే ఆకలి, అవమానాలు, పేదరికం, అవిద్య, అస్పృశ్యతల్ని ఎదుర్కొని పట్టుదలతో పై చదువులు చదివి ఎన్నో ఉన్నత శిఖరాలు సాధించిన అక్షర జ్వలితుడు ఇనాక్.
వేజండ్ల 'ఊరబావి'లోంచి జ్ఞాన జలాలుతోడి పంచిన భగీరధులు ఇనాక్. 195లోనే 'దృష్టి' నాటకం రాసి ఆకాశవాణి అవార్డ్ పొందటం గొప్ప విషయం. ఈ నాటకం జాతీయ స్థాయిలో తెలుగు నాటకానికి ఓ గుర్తింపు గౌరవం ఖ్యాతి తెచ్చింది. శ్రీకృష్ణ దేవరాయలు, తిమ్మరుసు మంత్రి, లోహితాస్యడు, మేరిమాత అడ్వకేటు వెంకన్న పోలీసు ఆఫీసర్; సైనికుడు లాంటి పాత్రలు ధరించిన గొప్ప నటుడు ఇనాక్. మేలుకొలుపు; నటన, జైహింద్ లాంటి నాటకాన్ని స్వీయ దర్శకత్వంలో పోటీల్లో ప్రదర్శింపజేసి అలనాటి ఆంధ్రా యూనివర్శిటీ పెద్దలు. నటన ప్రయోక్తలైన కె.వి.గోపాలస్వామి, కె.వెంకటేశ్వరరావు లాంటి ఉద్ధండులచే 'సెబాస్' అనిపించుకొని పెక్కు బహుమతులొందారు ఇనాక్. ఇందిరమ్మ ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన ఇనాక్ ''రేపటి వెలుతురు' అనే బుర్రకథ రాసారు. శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీలో డ్రామా వింగ్‌కు డీన్‌గా పని చేసారు ఇనాక్. THE FIFTH ESTATE / ఓట్లాట / నీడ / ఇడుగో ఏసుక్రీస్తు / మనలాంటి మనిషి / సాక్షి / కీ / జైహింద్ / కూలీ / దర్శనం / న్యాయం/ సమానత్వం / నిర్భయం / దృష్ణి / జ్యోతి / త్యాగి / అభ్యుదయం / అమ్మ / దిక్కు లేనోడు / ఈ తరం భార్యలు / మంచు శిఖరం / భార్యా విధేయులు / భార్య చాటు భర్తలు / లాంటి చైతన్యపూరిత నాటిక - నాటకాలు రాసి - నటించి, దర్శకత్వం వహించిన నట దర్శక ప్రయోక్త శ్రీ కొలుకలూరి ఇనాక్. ఆకాశవాణి; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం; సాహిత్య అకాడమీ; భారత ప్రభుత్వం (పద్మశ్రీ) లాంట విశిష్ట పురస్కారాలు పొందిన ఇనాక్ శ్రీ వేంకటేశ్వరా యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్‌గా పని చేసారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీలో దాదాపు 17 సం||లు పనిచేశారు.
వీరి కథానికలు పాఠ్యాంశాలుగా ఉండటం గొప్ప విశేషం. మనిషి విలువ- మాట తప్పని కుందేలు, ఆవు పులి, అపాయం - ఉపాయం, సింహమూ - ఎలుకా, మంచి - చెడు, తొడేలు- మేకపిల్ల- ఎద్దులు సింగం లాంటి సంగీత నృత్య రూపకాలు, పలు రేడియో నాటికలు రాసిన ఇనాక్ తెలుగు నాటక రంగంలో ఓ సువర్ణపుట. వీరి సాహిత్యం పలు భాషల్లో అనువాదాలు అయ్యాయి. విశిష్ట జ్ఞాన్‌పీఠ (మూర్తి దేవి) పురస్కారం పొందిన అక్షర ఋషి ఇనాక్.
21వ తంగిరాల అవార్డ్ ఒనిక్ గారికి ప్రదానోత్సవం సందర్భంగా
- తంగిరాల చక్రవర్తి,
9393804472