Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను..
మనీషాను మాట్లాడుతున్నా...
నేనిపుడు
విగతజీవిని కాదు
జీవించే ప్రశ్నను
నా ఒంటిని చీల్చినందుకు కాదు
నా తల్లి, సోదరుడు ఏడుస్తున్నది
మీ కుటిల నీతిని నమ్మినందుకు
శతాబ్దాలుగా నా జాతికి తగిలిన
గాయాలను లెక్కేసుకుంటూ దుక్కిస్తున్నారు...
అవమాన భారంతో....
తెగిపడ్డ నా నాలుక
నిశ్శబ్దమై లేదిపుడు
తరాలుగా మా తనువులే
మానభంగ కేంద్రాలవుతున్నందుకు
కారకులెవరని ప్రశ్నిస్తున్నది
నా జననాంగంలో దూరిన
మర్మంగాలను తీసి కాలుస్తున్న
మనువాదపు పాలనలో చీకట్లను
లోకానికి చూపేందుకు...
తెగిపడ్డ నా నాలుక
ఆత్మ గౌరవ పతాకమై అరుస్తూన్నది
న్యాయం కోసం పోరాడండని
వంచకుల పంచన కాక
ఆత్మ గౌరవంతో జీవించండని
నా జననాంగాన్ని దురాక్రమించిన
మగ దురహంకారుల మర్మంగాలను
ఒక్కొక్కటిగా కాల్చివేస్తూ
ఆ మంటల వెలుతురులో
మీ పాలనలో చీకట్లున్నంత దూరం
ప్రయాణిస్తా...
వెలుగుల ప్రశ్నల అడుగులు వేస్తూ....
- దిలీప్.వి,
8464030808