Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రేకలు వారంగానే
రాత్రికి రాత్రి వచ్చిన
మీసాలని కూడా తీసేయక
నిన్న మిగిలిన ఆట కోసం
దోస్త్ గాన్ని లేపి యాపచెట్టు కింద
గుంపులు గూడిన రోజులు బాగుండే
ఆకలి పిలిస్తే తప్ప
అమ్మ పిలిచిన గానీ
ఆ పిలుపే చెవున పెట్టకుండా
గురి తప్పని ఏకలవ్యుని బాణంలా
గోలిలాటకు గల్లీ దోస్తుల లొల్లి
లొల్లిలో గెలిచినా తొండాట బాగుండే
చిరిగిన బట్టలే ఉన్నా
మా గల్లీలో మేమే హీరోలం,
మేమే గ్యాంగ్ స్టార్లం,
పొలాల్లో వేటకు బయల్దేరే పోటుగాళ్ళం,
జొన్నసెలల్లో దూరి
జేజుల్లో నింపిన, బెబ్బరికాయ,
దోసకాయల బరువే బాగుండే.
ఎడ్లకాడికి బోయి
రేగుపండ్లను దెంపి బడిలో అమ్మి,
సాయంత్రం కొనుకొని తిన్న
కొబ్బరిగోలీలు, టయంపాసులు, బాగుండే
బాయిలో ఈతకొట్టి బయటకొచ్చి తిన్న
పులిచింతకాయల రుచి బాగుండే.
చీకటిపడ్డగానీ దాచుకోలేక,
పాతగోడల తడకల దాపుకి ఆడిన డిపాటా
బంతితో కొట్టిన లింగోస్,
కొమ్మలెక్కి ఆడిన కోతి కొమ్మ,
ఉప్పుతో పొయ్యని ఉప్పూగేరి,
చెప్పులను కోసి చేసిన పెద్ద బండి,
ఆ అల్లరి చేసిన రోజులే బాగుండే.
అందుకేగా మరి !
ఆ బాల్యం బాగుండే !!
- రాజు పల్లె,
9666207288