Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు మనం
చెరచబడ్డ స్వాతంత్య్రం గురించి
మాట్లాడుకోవాలి
మహాత్ముని పుట్టినరోజు కానుకగా
ఒకరోజు ముందు ఆహుతైపోయిన
మన ఆడబిడ్డ గురించి
మాట్లాడుకోవాలి
అర్థరాత్రి స్వాతంత్య్రంలో
చిత్తకార్తి కుక్కల పురుషాధిక్యత గురించి
మాట్లాడుకోవాలి
కులం మత్తు ఇంజెక్ట్ చేయబడ్డ
సైకో నా కోడుకులు
అణగారిన వర్గాలపై చేస్తున్న
అత్యాచారాల గురించి
మాట్లాడుకోవాలి
అమ్మను ఆరాధించే, ఆడదానికి గుడికట్టే
ఈ దేశంలోకి చొరబడ్డ
దొంగనా కొడుకుల గురించి
మాట్లాడుకోవాలి
అగ్రవర్ణం, ఆధిపత్యం
అవినీతి, అమానుషం తలకెక్కిన
మేకవన్నె పులుల గురించి
మాట్లాడుకోవాలి
ఇప్పుడు మన
నాలుక తెగ్గోసి, వెన్ను విరచబడ్డ
భారతాన్ని గురించి
మాట్లాడుకోవాలి
అంతేకాదు, అచ్చోసిన వదిలేయబడ్డ
ఆంబోతులకు వొట్టకొట్టడం గురించి
మూలవాసుల మానాభిమానాలకు చిచ్చుబెట్టే
ముండమోపి గూండాలకు
గూటం గొట్టడం గురించి
మాట్లాడుకోవాలి
మన బిడ్డల మానాలను చెరచకముందే
మన కనుపాపల దీపాలను ఆర్పకముందే
ఇప్పటికైనా మనం మాట్లాడుకోవాలి.
- కృష్ణ సముద్ర