Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకలి పస్థులంటని పొద్దు కోసం
పరితపించే ఉంటారు
అడ్డాలలో పసిడి కన్నులకు
స్వేచ్ఛా వాగ్దానాలు చేసే ఉంటారు...
తోలు బొమ్మల ఆటలల్లో
పోరాటపు కథలతో రక్తాన్ని ఉరికించారు...
యక్షగానాల పాటల ఒర్రెను పారించి,
ఊరిని కధంతొక్కించారు..
చుట్టకుదురుపై గడ్డి మోపులుగా
చెరువు కట్టపై ప్రతిబింబాలై
స్వేచ్ఛా ఊపిరుల సాగిపోయే వుంటారు.
బుగ్గ లైటును ఒత్తిని ఎగదోస్తూ
కాగడాలుగా కదిలి పోయేవుంటారు...
చీకటిలో వెలుగుపూల తారలుగా
కాలంలో నిలబడిన వీరులు...
పడమటి పొద్దుల్ల
తుదిశ్వాసలవుతూ
ఆకాంక్షల్ని
రేపటికి ఒప్పజెప్పిన యోధులు..
పొలిమేరల్లో కురిసిన తూటాలలో
నిషిద్ధ నినాదాలతో ప్రాణాలు ఇచ్చిన వారు.
పర్రెలు వారిన రేగడిలో
పోరుపంటలు పండించే వుంటారు.
తెరచినవున్న రెప్పలుగా
బావుటాల కొనల రెపరెపలలో
నిలిచి వున్న అమరులు... వారు
- సీహెచ్. ఉషారాణి,
9441228142