Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక ఉదయం
సూర్యోదయం కావాలి
ఒక చట్టం
ప్రాణహిత కావాలి
పుట్టిన చట్టాలన్ని ఉరికొయ్యలే !
వాళ్ళు
పండించిన పంటలు ముప్పూటలు తింటరు
ఒక్క పూటన్న వాళ్ళ ఆలోచనుండదు
సిమ్ కార్డుల్లా చట్టాలు మారుతయి
పొలం గట్టున వాళ్ళ జీవితాలు ఎండిపోతయి
తుపాకుల శబ్దాలు వినిపించినంత సహజంగా
నాగేటి చాళ్ళచప్పుళ్లు విన్పడవు
వాళ్లకు
పండించడానికి చేతులున్నవిగానీ
మాట్లాడటానికీ నోరు లేనోళ్లు
దేశానికీ వెన్నెముకలు
వాళ్ల తలరాతలు మార్చడాని
ఏ రాజకీయ బ్రహ్మకు చేతులులేవు
ఏ సన్యాసికీ చెమట తెలువదు
వాళ్ళను
నిలువునా ముంచనిదెవరు
ఉరితాళ్లు పేనందెవరు
శిలువేయందెవరు
నిండా వానలొస్తే బుడ్డదంట్లలా మురిగిపోతరు
ఎండల్లో గడ్డిపోసల్లా ఎండిపోతరు
మాతదేశం,మాతభూమి,మాతభాష
మాత రైతులయ్యారు
ఎన్నికల్లో గెలిచినోళ్లంతా
అధిపతులైతే
నాగళ్లను దరించినోళ్లంతా శవాలైండ్రు
కొత్తకొత్త చట్టాలు పుట్టుకొస్తుంటే
వాళ్ల శవాలే
అన్నం మెతుకులైతవి
(కేంద్ర రైతు చట్టాలపై నిరసనగా)
- వనపట్ల సుబ్బయ్య, 9492765358